మనస్సు - తరాల జ్ఞాపకాల తోరణం
మనస్సు ఒక అందమైన నిజం మీద తేలియాడే అబద్ధం, అసలు మనస్సు ఉందా లేదా అనే ఆలోచనలోనే అసలైన సమాధానం దాగుడుమూతలు ఆడుతుంది.
మనస్సు - మేదస్సు ఆడే దాగుడుమూతలో, మనం పట్టుకునేది ఒక్కటే అదే ఆలోచన (కానీ రెండిటిని వేరు చేసే మాట్లాడే వారు కూడా ఉన్నారు), మనస్సు ఆలోచనకు దారి తీస్తే, మేదస్సు దాన్ని దాచి భావాల యొక్క భారాన్ని పెంచుతుంది, ఆ భారాన్ని మోయడం వలనే మేదస్సు ఆయువు అరిగిపోతుంది అనుకుంటా.
ఆలోచనలకి దారి తీసే మనస్సు తన గమ్యాన్ని మారుస్తు చివరి ప్రయాణానికి దారి తెలియక దారి మధ్యలో ఆగి ఆలోచిస్తే.
ఎక్కడ పుట్టాను, ఏం చేశాను, ఏం చేయబోతున్నాను, మేదస్సు తోడు లేక పోవడంతో ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళాలో తెలియక తిరుగుతున్నా, కొన్ని యుగాల నుండి తిరుగుతున్నా కూడా కొంచం అనుభవం సంపాదించలేకపోయానే (తన చివరి స్థానానికి).
ముగించిన జీవితంలో సంపదని తీసుకవెళ్ళలేము అలాగే అనుభవం కూడా ఒక సంపదనే అని వదిలేసి వచ్చానా.
"తరాల జ్ఞాపకాలని దాచుకోలేక పండగకి గుమ్మానికి కట్టిన తోరణంలా మారుతున్నాను"
------------------------------------------------------------------------------------------------------------------
(Translated By Google)
The soul is a lie that floats on top of a beautiful truth, the real answer lies in the thought of whether or not there is a real soul.
In the hide-and-seek that mind-intellect plays, all we catch is the same thought (but there are those who separate the two), if the soul gives way to thought, the brain hides it and increases the burden of feelings, carrying that burden wears the brain is dissolving.
The soul which gives way to thought it's forgetting its destination and the soul thinks about how to reach its destination.
Where I was born, what I have done, what I am going to do, wandering about without knowing where to go due to lack of intelligence, even though I have been wandering for some ages, I have not been able to gain some experience (to reach the destination).
It has been left out that wealth cannot be carried away in a finished life and experience is also wealth.
"Unable to hide the memories of generations, I am becoming like an arch
on the threshold of a festival"
