మనస్సు - తరాల జ్ఞాపకాల తోరణం
మనస్సు ఒక అందమైన నిజం మీద తేలియాడే అబద్ధం, అసలు మనస్సు ఉందా లేదా అనే ఆలోచనలోనే అసలైన సమాధానం దాగుడుమూతలు ఆడుతుంది. మనస్సు - మేదస్సు ఆడే దాగుడుమూతలో, మనం పట్టుకునేది ఒక్కటే అదే ఆలోచన (కానీ రెండిటిని వేరు చేసే మాట్లాడే వారు కూడా ఉన్నారు), మనస్సు ఆలోచనకు దారి తీస్తే, మేదస్సు దాన్ని దాచి భావాల యొక్క భారాన్ని పెంచుతుంది, ఆ భారాన్ని మోయడం వలనే మేదస్సు ఆయువు అరిగిపోతుంది అనుకుంటా. ఆలోచనలకి దారి తీసే మనస్సు తన గమ్యాన్ని మారుస్తు చివరి ప్రయాణానికి దారి తెలియక దారి మధ్యలో ఆగి ఆలోచిస్తే. ఎక్కడ పుట్టాను, ఏం చేశాను, ఏం చేయబోతున్నాను, మేదస్సు తోడు లేక పోవడంతో ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళాలో తెలియక తిరుగుతున్నా, కొన్ని యుగాల నుండి తిరుగుతున్నా కూడా కొంచం అనుభవం...