Pailwan Paisa
అనగనగా ఒక ప్రపంచం ఆ ప్రపంచంలో జంతువులు మనుషులు ఇలా అనేక వర్గాలు, ఈ వర్గాల్లో అందరికన్నా తెలివి తక్కువ వాడిని(ఎందుకు అంటే నేను స్వయంగా ఆలోచించలేను), శారీరక ద్రరూఢత్వం లేని వాడిని నేను నా పేరు పైసా, నా వయస్సు వందల ఏళ్ళు కానీ కాలనీ బట్టి మారుతూ వచ్చను, అంతే కాదు అండోయి నాకు చాల పేర్లు కూడా వున్నాయి అండి ప్రాంతాని బట్టి పేరు మారుతూవుంటుంది.
ఇక మా వంశాన్నికి వస్తే, మా వంశం ప్రపంచాన్ని ఎల్లుతుంది కానీ మాల్లో కొందరి చావు మమల్ని ఎంతగానో బాధించింది, మా వంశంలోని అణా, ఐదు పైసలు, పది పైసలు, యిరవై - యిరవై ఐదు - యాభై పైసలు ఒక్కపుడు ఎంతో ఆరోగ్యంగా ఉండేవి కానీ అనుకోకుండా ఒకటి తరువాత ఒకటి చనిపోవడం మా వంశంలో తీరలేని కలతని సృష్టించాయి,
ఆ బాధ నుండి తెలుకోవడానికి మాకు ఎక్కువ సమయం పట్టలేదు ఎందుకు అంటే, మొదట్లో మా జీవనం ఎక్కువగా బిందాలలో, అల్మారాలో, భూమి లోపల మొదలగు ప్రాంతాల్లో ఉండేది, అది మాకు ఒక బానిసా బ్రతుకుల అనిపించేది, కాలం గడుస్తున్నా కొద్దీ ఎం జరిగిందో తెలీదు మా జీవిన పద్దతి మారింది, ఇప్పుడు మనుషులు అంత మాకింద బానిసలుగా అనిపిస్తున్నారు, వాళ్ల జీవితం మొత్తం మాతో తూకం వేస్తున్నారు,
అంత బాగుంది అనుకునే లోపే ఈ మనుషుల వాళ్ళ మా వంశంలో చీలికలు మొదలయ్యాయా, మా వంశంలో అందరికన్నా చిన్న వాడు రెండువేళ్ళ నోటు వాడు పుట్టి నాలుగు సంవత్సరాలు అయింది కానీ ఈ మనుషుల అతి వినయం ప్రేమ వాళ్ళ వాడు మా తల ఎక్కి కూర్చున్నాడు, అంతే కాదు వాడి కోసం ఎంతో మంది తమ ప్రాణాలను పణంగా పెడ్దుతున్నారు ఎందుకో అర్ధం కావడంలే,
మనుషులు తమ గొప్ప కోసం, తమ గురించి పది మంది మాట్లాడుకోవాలి అని, తమ సౌకర్యం కోసం మమల్ని వాళ్ళ బానిసలుగా చేసుకొని, పైకి మాత్రం వల్లే మా బానిసలూ అన్నట్టు నటిస్తు, తమకి నచ్చి నప్పుడు లేదా అవసరం లేదు అనిపించినాడుప్పుడు మమల్ని చంపడం(నోట్ల రద్దు) లాంటివి చేస్తూ మా వంశాన్ని నీరుగారుస్తున్నారు, అందుకే ఆ దేవుడు కనిపిస్తే మేము కోరుకునేది ఈ మనుషుల వినాశనం మా స్వేచ్ఛ (వస్తు మార్పిడి).
Writen By Ranjith Arvapally
#money #paisa #ranjitharvapally #blogonmoney